Friday, April 13, 2012

Yendi chepalu mulakkada pulusu

ఎండి చేప ములక్కాడ పులుసు

కావలసినవి: 
  1. చిన్న ఎండి చేపలు-7 
  2. ములక్కాడలు -5
  3. ఉల్లిపాయలు-4 (పెద్దవి)
  4. పచ్చిమిర్చి-5 
  5. టొమాటో-2 
  6. చింత పండు-పులుపుకి సరిపడినంత
  7. కరివేపాకు-రెండు రోబ్బలు
  8. తాలింపు గింజలు -౧/2  టీ స్పూన్
  9. ఉప్పు-ఒక టీ స్పూన్
  10. కారం-ఒక టీ స్పూన్
 తయారు చేసే విధానం:
  • ఎండి చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ములక్కదాలను కడిగి కట్ చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,టొమాటో లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • చింత పండును కొద్దిగా నీటిలో నానబెట్టుకొని ఉంచాలి.
  • ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నూనె వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కాగిన ఈ నూనెలో ఎండి చేపలను వేసి వేపుకోవాలి.బంగారు రంగు వచ్చాక ఈ చేపలను తీసి పక్కన పెట్టాలి.
  • తర్వాత  నూనెలో కొద్దిగా తాలింపు గింజలు కరివేపాకు వేసి వేపాలి.దీనికి
  • కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి  ముక్కలను కూడా వేసి కలపాలి.
  • ఇవి బాగా వేగాక టమోటో ముక్కలను వేసి వేయించి.,కట్ చేసిన ములక్కాడ ముక్కలను ఇందులో వేసి ఉప్పు,కారం వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
  • ౩ నిముషాల తర్వాత బాగా కలిపి చింత పండు రాసాని దీనిలో పొయ్యాలి.
  • ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి ఒక 7 నిమిషాలు ఉడికించాలి.
  • ఇప్పుడు నోరూరించే ఎండి చేప ములక్కాడ పులుసు రెడీ.

 



0 comments:

Post a Comment