ఎండి చేప ములక్కాడ పులుసు
కావలసినవి:
- చిన్న ఎండి చేపలు-7
- ములక్కాడలు -5
- ఉల్లిపాయలు-4 (పెద్దవి)
- పచ్చిమిర్చి-5
- టొమాటో-2
- చింత పండు-పులుపుకి సరిపడినంత
- కరివేపాకు-రెండు రోబ్బలు
- తాలింపు గింజలు -౧/2 టీ స్పూన్
- ఉప్పు-ఒక టీ స్పూన్
- కారం-ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం:
- ఎండి చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ములక్కదాలను కడిగి కట్ చేసుకోవాలి.
- ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,టొమాటో లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- చింత పండును కొద్దిగా నీటిలో నానబెట్టుకొని ఉంచాలి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నూనె వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
- ఇప్పుడు కాగిన ఈ నూనెలో ఎండి చేపలను వేసి వేపుకోవాలి.బంగారు రంగు వచ్చాక ఈ చేపలను తీసి పక్కన పెట్టాలి.
- తర్వాత నూనెలో కొద్దిగా తాలింపు గింజలు కరివేపాకు వేసి వేపాలి.దీనికి
- కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి ముక్కలను కూడా వేసి కలపాలి.
- ఇవి బాగా వేగాక టమోటో ముక్కలను వేసి వేయించి.,కట్ చేసిన ములక్కాడ ముక్కలను ఇందులో వేసి ఉప్పు,కారం వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
- ౩ నిముషాల తర్వాత బాగా కలిపి చింత పండు రాసాని దీనిలో పొయ్యాలి.
- ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి ఒక 7 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు నోరూరించే ఎండి చేప ములక్కాడ పులుసు రెడీ.
జంతికలు
కావలసినవి:
- పచ్చి శెనగపప్పు-అర కిలో
- బియ్యం -కిలో
- నూనె-కిలో
- కారం -తగినంత
- ఉప్పు-తగినంత
- సోడా గుండ -చిటికెడు
- జీలకర్ర-తగినంత
తయారు చేసే విధానం:
- ముందుగ పచ్చి శెనగపప్పు,బియ్యం కలిపి మెత్తగా పిండి పట్టించాలి.
- ఇప్పుడు ఈ పిండిని ఒక పళ్ళెం లోకి తీసుకొని దానికి ఉప్పు,కారం,జీలకర్ర ,సోడా గుండ జోడించి అన్ని కలిసేటట్లు పిండి మొత్తాన్ని కలపాలి.
- కలిపిన ఈ మిశ్రమంలో నీరు పోసి కొంచెం మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఈ ముద్దను ౧౦ నిముషాలు మూత పెట్టి నాననివ్వాలి.
- ఇలా చేయడం వలన జంతికలు కరకరమంటాయి.
- ఇప్పుడు ఒక కలాయిని తీసుకొని అందులో నూనె పోసి స్టవ్ వెలిగించి కాసేపు కాగనివ్వాలి.
- నూనె మరిగిన తర్వాత జంతికల గొట్టంలో కలిపిన ముద్దని పెట్టి నొక్కాలి.
- వీటిని బంగారు రంగు వచ్చేవరకు కాగనిచ్చి తీసేయాలి.
- ఇప్పుడు కరకరలాడే జంతికలు రెడీ.
గుత్తి వంకాయ వేపుడు
కావలసినవి:
- నల్ల వంకాయలు(చిన్నవి)
- ఉల్లిపాయలు
- జీలకర్ర
- అల్లం
- వెల్లుల్లి పాయలు
- పచ్చిమిర్చి
- టమేటా
- ఉప్పు
- నూనె
- కొత్తిమీర
తయారు చేసే విధానం:
- ముందుగా వంకాయలను శుబ్రంగా కడగాలి.తర్వాత కడిగిన వంకాయలను కిందన చూపించినట్లు కట్చేసుకోవాలి.

- ఇప్పుడు ఈ వంకాయలను కొద్దిగా నీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి.
- తర్వాత ఉడికిన ఈ వంకాయలను ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు మసాల ముద్ద కోసం ఉల్లిపాయలు,అల్లం,పచ్చిమిర్చి,టొమాటో,జీలకర్ర,వెల్లుల్లిపాయలు,ఉప్పు మొత్తంగా గ్రైండ్ చేసుకోవాలి
- ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి స్టవ్ మీద పెట్టి గ్రైండ్ చేసిన ముద్దను మూడు నిమిషాలు వేయించాలి.
- వేయించిన ఈ ముద్దను కాసేపు చల్లారనివ్వాలి.
- చల్లారిన మసాల ముద్దను వంకాయలలో చక్కగా పట్టించి ఒక్కొక్కటిగా నూనెలోవేసి వేయించుకోవాలి.
- అన్ని వంకాయలను నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.
- అంతే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ ఫ్రై రెడీ.
- ఇప్పుడు మీకు నచ్చిన విదంగా గార్నిష్ చేసి సర్వే చేసుకోవాలి.