Slide Title 1

Aenean quis facilisis massa. Cras justo odio, scelerisque nec dignissim quis, cursus a odio. Duis ut dui vel purus aliquet tristique.

Slide Title 2

Morbi quis tellus eu turpis lacinia pharetra non eget lectus. Vestibulum ante ipsum primis in faucibus orci luctus et ultrices posuere cubilia Curae; Donec.

Slide Title 3

In ornare lacus sit amet est aliquet ac tincidunt tellus semper. Pellentesque habitant morbi tristique senectus et netus et malesuada fames ac turpis egestas.

Friday, April 13, 2012

Yendi chepalu mulakkada pulusu

ఎండి చేప ములక్కాడ పులుసు

కావలసినవి: 
  1. చిన్న ఎండి చేపలు-7 
  2. ములక్కాడలు -5
  3. ఉల్లిపాయలు-4 (పెద్దవి)
  4. పచ్చిమిర్చి-5 
  5. టొమాటో-2 
  6. చింత పండు-పులుపుకి సరిపడినంత
  7. కరివేపాకు-రెండు రోబ్బలు
  8. తాలింపు గింజలు -౧/2  టీ స్పూన్
  9. ఉప్పు-ఒక టీ స్పూన్
  10. కారం-ఒక టీ స్పూన్
 తయారు చేసే విధానం:
  • ఎండి చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ములక్కదాలను కడిగి కట్ చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,టొమాటో లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • చింత పండును కొద్దిగా నీటిలో నానబెట్టుకొని ఉంచాలి.
  • ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నూనె వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కాగిన ఈ నూనెలో ఎండి చేపలను వేసి వేపుకోవాలి.బంగారు రంగు వచ్చాక ఈ చేపలను తీసి పక్కన పెట్టాలి.
  • తర్వాత  నూనెలో కొద్దిగా తాలింపు గింజలు కరివేపాకు వేసి వేపాలి.దీనికి
  • కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి  ముక్కలను కూడా వేసి కలపాలి.
  • ఇవి బాగా వేగాక టమోటో ముక్కలను వేసి వేయించి.,కట్ చేసిన ములక్కాడ ముక్కలను ఇందులో వేసి ఉప్పు,కారం వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
  • ౩ నిముషాల తర్వాత బాగా కలిపి చింత పండు రాసాని దీనిలో పొయ్యాలి.
  • ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి ఒక 7 నిమిషాలు ఉడికించాలి.
  • ఇప్పుడు నోరూరించే ఎండి చేప ములక్కాడ పులుసు రెడీ.

 



Janthikalu

జంతికలు

 

కావలసినవి:
  1. పచ్చి శెనగపప్పు-అర కిలో
  2. బియ్యం -కిలో
  3. నూనె-కిలో
  4. కారం -తగినంత
  5. ఉప్పు-తగినంత
  6. సోడా గుండ    -చిటికెడు
  7. జీలకర్ర-తగినంత

తయారు చేసే విధానం:
  1. ముందుగ పచ్చి శెనగపప్పు,బియ్యం కలిపి మెత్తగా పిండి పట్టించాలి.
  2. ఇప్పుడు ఈ పిండిని ఒక పళ్ళెం లోకి తీసుకొని  దానికి ఉప్పు,కారం,జీలకర్ర ,సోడా గుండ జోడించి అన్ని కలిసేటట్లు పిండి మొత్తాన్ని కలపాలి. 
  3. కలిపిన ఈ మిశ్రమంలో నీరు పోసి కొంచెం మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఈ ముద్దను ౧౦ నిముషాలు మూత పెట్టి నాననివ్వాలి.
  5. ఇలా చేయడం వలన జంతికలు కరకరమంటాయి.
  6. ఇప్పుడు ఒక కలాయిని తీసుకొని అందులో నూనె పోసి స్టవ్ వెలిగించి కాసేపు కాగనివ్వాలి.
  7. నూనె మరిగిన తర్వాత జంతికల గొట్టంలో  కలిపిన ముద్దని పెట్టి నొక్కాలి.
  8. వీటిని  బంగారు రంగు వచ్చేవరకు కాగనిచ్చి తీసేయాలి.  
  9. ఇప్పుడు కరకరలాడే జంతికలు రెడీ. 
 

 

Thursday, April 12, 2012

Gutthi vankaya Fry

గుత్తి వంకాయ వేపుడు


కావలసినవి:

  1. నల్ల వంకాయలు(చిన్నవి)
  2. ఉల్లిపాయలు
  3. జీలకర్ర
  4. అల్లం
  5. వెల్లుల్లి పాయలు
  6. పచ్చిమిర్చి
  7. టమేటా
  8.  ఉప్పు
  9. నూనె
  10. కొత్తిమీర  

 

తయారు చేసే విధానం:

  1. ముందుగా వంకాయలను శుబ్రంగా కడగాలి.తర్వాత కడిగిన వంకాయలను కిందన  చూపించినట్లు కట్చేసుకోవాలి. 
  2. ఇప్పుడు ఈ వంకాయలను కొద్దిగా నీళ్ళలో కొద్దిసేపు ఉడికించాలి.
  3. తర్వాత ఉడికిన ఈ వంకాయలను ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు మసాల ముద్ద కోసం ఉల్లిపాయలు,అల్లం,పచ్చిమిర్చి,టొమాటో,జీలకర్ర,వెల్లుల్లిపాయలు,ఉప్పు  మొత్తంగా గ్రైండ్ చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి స్టవ్ మీద పెట్టి గ్రైండ్ చేసిన ముద్దను మూడు నిమిషాలు వేయించాలి.
  6. వేయించిన ఈ ముద్దను కాసేపు చల్లారనివ్వాలి.
  7. చల్లారిన మసాల ముద్దను వంకాయలలో చక్కగా పట్టించి ఒక్కొక్కటిగా నూనెలోవేసి  వేయించుకోవాలి.
  8. అన్ని వంకాయలను నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.
  9. అంతే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ ఫ్రై రెడీ. 
  10. ఇప్పుడు మీకు నచ్చిన విదంగా గార్నిష్ చేసి   సర్వే చేసుకోవాలి.

         
Saved